సారాంశం
Author:Rajiv Malhotra
Translation: RM Team
http://thebattleforsanskrit.com/synopsis/
భారతీయ చరిత్రను మరియు తత్త్వ శాస్త్రాలను పాశ్చాత్య విధానంలో అధ్యయనం చేయటం అనే ప్రక్రియ గత కొన్ని దశాబ్దాలుగా చాలా వేగంగా జరుగుతోంది.దీనికి కార్యక్షేత్రం ప్రధానంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు. వీటిని దీటుగా ఎదుర్కొనుటకు ఒక నూతన సాంస్కృతిక చైతన్యానికి మన భారతీయ సమాజంలో ఈ మధ్య కాలంలో బీజం పడింది. సంప్రదాయ సంస్కృత (అలాగే “సంస్కృతి”) పండితులను ఒక ప్రధానమైన విదేశి ఆలోచనా సరళి గురించి జాగరూకం చేయుట “బాటిల్ ఫర్ సాన్సక్రిట్” అను ఈ పుస్తకం యొక్క ముఖ్యోద్దేశం.ఈ విదేశి ఆలోచనవిధానమే ఇప్పుడు భారతీయ సాంస్కృతిక,సామాజిక మరియు రాజకీయ రీతిని,నడకని శాసించే స్థితికి చేరబోతోంది.ఈ విద్యారంగాన్ని ఇండాలజీ లేదా సాన్సక్రిట్ స్టడీస్ గా వ్యవహరిస్తారు.సంస్కృత భాషలో స్వాభావికంగా ఎన్నో దోషాలు ఉన్నాయని తమ పరిశోధనల ద్వారా తేల్చేసిన ఈ ఇండాలజీ ‘మేధావులు’, వాటిని తొలగించడం, అనే ప్రకటిత లక్ష్యంతో ఆధునిక భారత సమాజంలో జోక్యం చేసుకొంటున్నారు.అభిప్రాయంలో సంస్కృత గ్రంథాలు రాజకీయ అస్త్రంగా ప్రజల హక్కులను అణచివేయడానికి ఉపయోగపడ్డాయని వాళ్ళ తీర్పు.వాటిలో ఉన్న ఆధ్యాత్మిక అంశాలను తిరస్కరించాల్సిన అవసరం ఉన్నదని అనడమేకాక,ఇంకొక్క అడుగు ముందుకు వేసి అసలు భాషగా సంస్కృతం ఎన్నడో “చనిపోయిందని” ఈ మేధావుల ప్రధాన వాదనలు .సంప్రదాయ పండితులైన వారు ఎవరైనా ఈ వాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు లేదా కనీసం వారి తర్కాన్ని తప్పకుండా ప్రశ్నిస్తారు.
పాశ్చాత్య ఇండాలజి ఎక్కడ గాడి తప్పిందో తెల్సుకోవటానికి రాజీవ్ గారు చేసిన అవిరళ కృషి,అలాగే పాశ్చాత్యుల వాదానికి ఎదురుగా బలంగా నిలబడడానికి రాజీవ్ గారు ప్రతిపాదించిన సనాతన భారతీయ మార్గం – ఇదంతా జరగటానికి పూర్వరంగం భారత దేశానికి నాలుగు స్తంభాలు అనదగ్గ శంకరాచార్య పీఠాలలో ప్రముఖమైన శృంగేరి శారదా పీఠానికి సంబంధించిన ఒక ప్రాజెక్టుతో మొదలయ్యింది. ఆ ప్రాజెక్టు వలన శారదా పీఠ వాఙ్మయం ,అదే విధంగా వారి భోదనలు వక్రీకరణకి గురయ్యే తీవ్ర విపత్తుని రాజీవ్ గారు ముందుగానే గుర్తించారు .తద్వారా సనాతన ధర్మానికి కూడా ప్రమాదం ఎర్పడబోతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.
పాఠకుడి అభిప్రాయాలు ఈ పుస్తకానికి అనుకూలమైనా వ్యతిరేకమైనా, నిస్సందేహంగా ” బాటిల్ ఫర్ సాన్సక్రిట్” ఒక బలమైన వాదమును మీ ముందు ఉంచి, తద్వారా క్రొత్త దృష్టికోణాన్ని మరియు పరిశోధనను ఆవిష్కరిస్తుంది. పాఠకుడి అభిప్రాయాలు ఈ పుస్తకానికి అనుకూలమైనా వ్యతిరేకమైనా, నిస్సందేహంగా ” బాటిల్ ఫర్ సాన్సక్రిట్” ఒక బలమైన వాదమును మీ ముందు ఉంచి ,తద్వారా క్రొత్త దృష్టికోణాన్ని మరియు పరిశోధనను ఆవిష్కరిస్తుంది.ఈ పుస్తకం ఓకే విషయాన్ని రెండు కోణాల నుంచి విశ్లేషిస్తుంది అనటంలో సందేహం లేదు.అయితే ఈ రెండు కోణాలు పరస్పర విరుద్దమైనవా?లేక వాటి మధ్య సామీప్యత ఏర్పరచే అవకాశం ఉందా ? అన్న విషయం పాఠకుడే నిర్ణయించుకోవాలి.